తెలుగు సంగతులు

శనివారం, జనవరి 08, 2011

మనమందరం

"నీకోసం నువ్వు బతుకు... ఎవర్నీ నీకోసం బతకమని అడక్కు" -- అయాన్ ర్యాండ్.
"మనమందరం సామాజికంగా, మతపరంగా కొన్ని కొన్ని నిర్దేశించిన భావోద్వేగాలకు లోనయ్యేట్టుగా ప్రోగ్రాం అయి ఉన్నాం. ఇదే గొప్పది అనుకోవడం, దానికి విశ్వాసంగా ఉండడం, కట్టుబడి ఉండడం, కనీసం అవి ఎందుకు అలా చెబుతున్నాయో కూడా మనకు మనం ప్రశ్నించుకోకుండా వాటిని గుడ్డిగా అనుసరిస్తాం."---- రాంగోపాల్ వర్మ.

మిత్రులకు వందనాలు! ఈ మధ్య సంచలనం (అనుకుంటున్నారు మరి) సృష్టించిన రాంగోపాల్ వర్మ పుస్తకం "నా ఇష్టం" బాగానే ఎక్కువ ముక్కు సూటిగా, కొంచెం తార్కికంగా, కాస్తంత ఆలోచింపచేసేదిగా, అక్కడక్కడా అసందర్భంగా, ఎక్కడెక్కడో తిక్క తిక్కగా ఉంది. చాలావిషయాలు ఉత్కంఠ రేపేవిగా ఉన్నాయి. కొనదగినదే గాని కొంచెం ధర ఎక్కువే! రూ.175/-. అసలు విషయం. ఈ పుస్తకం ఆయనకే అంకితం. ఎందుకని అడక్కండి, అది ఆయనిష్టం-- అడగడానికి మనమెవళ్ళం- కొనడంవరకే!!! ఎమెస్కో పబ్లిషింగ్!


2 కామెంట్‌లు:

Praveen చెప్పారు...

Finally Meeru Ramgopal Varma ki Fan ga mare avakasalu unnattuga undi.

Krishna చెప్పారు...

ప్రత్యేక రాష్ట్రం లాంటి ఏ డిమాండునయినా, ప్రజాభీష్టం మేరకు, రాజ్యంగాబద్ధంగా సాధించుకోవాలి గాని.. correct sir! raajyaangabaddhangaane anadam correct!