తెలుగు సంగతులు

సోమవారం, నవంబర్ 10, 2008

జగతంతా జైలయితే

''జగతంతా జైలయితే'' అన్న మాట ఎవరన్నారో గాని ఇప్పుడు మరో విధంగా చెప్పుకోవాలి. జైలు లో బందిఖానా గా ఉండాలని మాత్రమె ఒకప్పటి చింత. తిండి, రక్షణ బ్రహ్మాండంగా ఉంటుందని తరచూ సినిమాలలో కూడా వెటకారం గా వాడుతూ ఉండే వారు. ఇప్పుడు ఆ సౌకర్యం కూడా కరువయినట్టే. ఎన్ని నేరాలకయినా ఒక్కటే శిక్ష కనుక నేరస్తులు మరో నేరానికి సిద్ధం గా ఉంటారని తెలివిపరులు గమనించారు. నేర వ్యవస్థకి ఇదో కొత్త మార్గం.
జైలులో ఉన్న ''మొద్దు''సజ్జుకే దిక్కు లేకపోతే ఇక ఇంత, జగమంత జైలు లో బక్కోడికి సామాన్యుడికి దిక్కెక్కడ?
ఇంటి కన్నా గుడి పదిలం, బయటికన్న జైలే నయం లాంటి పడికట్టు మాటలు మార్చాల్సిందే లేదా మరవాల్సిందే!

శుక్రవారం, నవంబర్ 07, 2008

గర్జనలు

అందరూ గర్జించే వాళ్ళే ! ఓట్లు అర్దించే వాళ్ళే బెటరేమో కదా! ప్రజా గర్జనలో ప్రజల మాట్లాడింది లేదు.ప్రజలంటే నాగ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అయితే అది ఓకే.
యువ గర్జనలో యువకులెవ్వరు వేదిక పైన లేనే లేరు. బాబు,హరి కృష్ణ, బాలకృష్ణ యువకులైతే మరి నేను నాకు జస్ట్ ౫౫ మాత్రమే!
ఇక ఇందిరమ్మ సంబరాలు -- అయ్యన్ని మరి సిత్రాలు. వచ్చిన జనం లాగా లేరు-- తెచ్చిన జనమే!
ఇంతమంది ప్రజా, యువ,జన శక్తులు, సమయం, వీటి కోసమే వృధా అయితే ఎలాగా చెప్పండి?

గురువారం, నవంబర్ 06, 2008

తెలుగు భాషకు ప్రాచీన హోదా

తెలుగు వారందరికి శుభాకాంక్షలు ! ఇది సంతోషించ తగ్గ విషయం. అయిన మన భాషకు ఒకరిచ్చేదేమిటి ? మన ప్రత్యేకత మనకుండనే ఉంది. ఈ శుభ సమయంలో మన వారందరికి ఒక చిన్ని తీపి కానుక. శ్రీ రమణ గారి మిధునం కధ తప్పకుండా చదవండి. ఇది ఒక పుస్తకం గ కూడా వచ్చింది. మిత్రులు ఎవరయినా ఈ కధ ను నెట్లో ఉంచగలిగితే సంతోషిస్తారు సాహితీప్రియులు. నాకు గొప్పగా నచ్చిన కధ ఇది.