''జగతంతా జైలయితే'' అన్న మాట ఎవరన్నారో గాని ఇప్పుడు మరో విధంగా చెప్పుకోవాలి. జైలు లో బందిఖానా గా ఉండాలని మాత్రమె ఒకప్పటి చింత. తిండి, రక్షణ బ్రహ్మాండంగా ఉంటుందని తరచూ సినిమాలలో కూడా వెటకారం గా వాడుతూ ఉండే వారు. ఇప్పుడు ఆ సౌకర్యం కూడా కరువయినట్టే. ఎన్ని నేరాలకయినా ఒక్కటే శిక్ష కనుక నేరస్తులు మరో నేరానికి సిద్ధం గా ఉంటారని తెలివిపరులు గమనించారు. నేర వ్యవస్థకి ఇదో కొత్త మార్గం.
జైలులో ఉన్న ''మొద్దు''సజ్జుకే దిక్కు లేకపోతే ఇక ఇంత, జగమంత జైలు లో బక్కోడికి సామాన్యుడికి దిక్కెక్కడ?
ఇంటి కన్నా గుడి పదిలం, బయటికన్న జైలే నయం లాంటి పడికట్టు మాటలు మార్చాల్సిందే లేదా మరవాల్సిందే!
1 కామెంట్:
అయ్యో! రాజమండ్రీ సెంట్రల్ జైల్లో భోజనం అమోఘమని బయట టాక్! అందరూ ఫలహారం అక్కడే వేడి వేడిగా తినేసి మిగిలినది సరిగ్గా పొద్దున్న ఏడు గంటల ప్రాంతంలో అమ్ముతారుట. ఎంతో మంది ఆ చుట్టపక్కల నివసించే వాళ్ళు అనేవారు ఇలాంటి ఘుమ ఘుమలాడే రుచికరమయిన భోజనం కోసమయిన సెంట్రల్ జైలుకి వెళ్ళాలి అని!
కామెంట్‌ను పోస్ట్ చేయండి