తెలుగు సంగతులు

బుధవారం, జూన్ 26, 2019

ప్రభుత్వం, ప్రతిపక్షం - ఏ రాయైతే ఏంటి?

ప్రభుత్వంప్రతిపక్షం -  రాయైతే ఏంటి?                      25-06-2019



తొమ్మిది నెలలు ముందుగానే,  ముందస్తు ఎన్నికలకెళ్ళడం కె సి ఆర్ తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమేఆలోచించుకుని చేసిన పనిప్రజా ప్రయోజనాల ఊసే ఇందులో రాదుప్రజాధనం వృధా అవ్వడం తప్ప.  సరే గెలిచారుబంగారు తెలంగాణ ఆశలు ప్రజల్ని వదల్లేదుపైగా ప్రతిపక్షాలు  మాత్రమూ బాధ్యతాయుతంగా ప్రవర్తించ లేదుప్రజలసమస్యల కోసం పోరాడిన ప్రతిపక్ష నాయకుడు ఒక్కరూ లేరుఫోటోలకోసం ఒకరోజు దీక్షలు చెయ్యడం వంటిక్రియాశూన్యమయిన కొద్ది గిమ్మిక్కులు తప్ప వారు పొడిచిందేమీ లేదుఅందుకే ప్రజలు టీ ఆర్ ఎస్ కే మళ్ళీ పట్టం కట్టింది.
అందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి కే సి ఆర్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలేంటిపూర్తి కాని ప్రాజెక్టుకు ప్రా'రంభో'త్సవాలుయాగాలూయజ్ఞాలూపార్టీ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనలూఅందుకోసం మొత్తం మంత్రివర్గమూశాసనసభ్యులూమిగతా వందిమాగధ బృందాలూ - వెరశి బొచ్చెడు ఖర్చూకాలయాపనారాష్ట్ర సచివాలయాన్నేసందర్శించని ముఖ్య మంత్రికి మరో సెక్రటేరియట్ కట్టడం ఆయనకు కనిపించిన ప్రాధాన్యంఇందులో కూడామఠాధిపతులవంటి వారి సలహాలే ఉండిఉంటాయి కానీఏమాత్రం ప్రజా ప్రయోజనాలూ ఉండవన్నది జగమెరిగినసత్యంఉమ్మడి రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్లమందిని పరిపాలించడానికిమభ్యపెట్టడానికి చాలిన ప్రాంగణం ఇప్పుడునాలుగు కోట్లమందికి ఎందుకు సరిపోదుఅభివృధ్ధి అంటే పాలకుల జీతాలూసౌకర్యాలూషోకులూ పెరగడమాదానికిప్రజలపై ఋణభారం పెరగడమా!

ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి చూడండిప్రజావేదిక కూలగొట్టడం - ఇప్పటికిప్పుడు వందల కోట్ల నష్టమేమీ వచ్చెయ్యదుకానీ మనం నిశితంగా చూడవలసిన అంశం -  సాక్షాత్తూ శాసనకర్తలూప్రభుత్వాలూ శాసనోల్లంఘన ఎలా చేస్తున్నారూఅన్న విషయం నివ్వెరపరిచే ఒక పార్శ్వం అయితే దాన్ని ఆపాల్సింది అప్పట్లో ఎవరుఅన్నది అసలైన పార్శ్వంబాధ్యత మొట్టమొదటగా ప్రతిపక్షానిదితరువాత ఆయా స్థానాల్లో ఉన్న అధికారులది

అయ్యా కొత్త ముఖ్యమంత్రి గారూఅప్పటి మీ శాసనసభ్యుల బలమెంతప్రజలు మీకు ఇచ్చిన ఓట్లెన్నికేవలంఒకటిన్నర శాతం మాత్రమే అధికార పార్టీ కంటే తక్కువొచ్చాయి మీకు ఓట్లుప్రజలు మీమీద అంత విశ్వాసం పెడితేవారిసొమ్మును కాపాడాల్సిన మీరు బాధ్యతాయుత ప్రతిపక్షంగా కాకతదుపరి పర్యాయం అధికారంలోకి రావడానికి మాత్రమే  కృషి చేసుకున్నారు తప్పప్రభుత్వంలో జరుగుతున్న ఇలాంటి అవకతవకల్ని నిలదీయలేదుఅరవయ్యేడు మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్న ప్రజల పట్ల ఎంత కార్యశూన్యత్వం చూపారుఅప్పటి ముఖ్యమంత్రి పై ఉండే దుగ్ధ కొద్దీవ్యక్తిగతఉడుకుమోత్తనం కొద్దీ శాసనసభకే దూరంగా ఉన్నారు కదా అది భావ్యమేనాఆదిలోనే తుంచేసి ఉంటేలేదాన్యాయపోరాటం చేసుంటే ఇప్పుడు ఇంత విధ్వంసం అవసరమయ్యేదాప్రజాధనం విచక్షణ లేకుండా తగలెట్టడంలోదొందూ దొందే అయ్యారు కదామళ్ళీ వారోమరొకరో అధికారంలోకి వస్తేమీరు కట్టినవన్నీ ఎదో ఒక వంకబెట్టి కూలగొట్టరన్ననమ్మకం ఏవుందిచట్టాలలో లొసుగులుండబట్టే కదా  అవ్యవస్థ అంతాచట్టాలలో లోపాలున్నట్టే కట్టడాలలోనూ ఏవోఅతిక్రమణలుండడం అతి సహజమయిన విషయాలు కదా మన దేశంలోమరి మరొకరు లోటస్ పాండుఇడుపులపాయవంకా చూడకుండా ఉంటారాసరే అవి మీ సొంత వ్యవహారాలు అనుకోండిఎలా చక్కబెట్టుకోవాలో మీకు రాజకీయాలతోపెట్టిన విద్యమరి  ప్రభుత్వ భవనాల మాటేంటిఅది స్వయంగా ప్రజల సొమ్ము కదా!
మీ తండ్రిగారి హయాం లోనేకదాఎల్ ఆర్ ఎస్బి ఆర్ ఎస్ వంటి వెసులుబాట్లిచ్చి పరిమితులు లేని లేఅవుట్లకూనిర్మాణాల అతిక్రమణలకూ కొంత అపరాధ రుసుం వసూలు చేసి క్రబధ్ధీకరించేరేప్రజావేదిక విషయంలో అలాంటివెసులుబాట్లు ఏవీ దొరకలేదాఅయినా శిక్షించాల్సింది అతిక్రమణకు పాల్పడినవారిని గానీ - - ప్రజల్నీప్రజా వనరుల్నీనా
అందరూ ఇలాగే చేస్తే ప్రజలకింక మిగిలిన దార్లేముంటాయిమధ్యస్తంగా వచ్చే కుల పార్టీలూగ్లామర్ పార్టీలూఏమాత్రం ఆశాజనకం కాదుఅందుకే వాటినీ తిరస్కరించారు కదా!  ఎర్ర జెండా ఎప్పటినుండో వెలిసిపోతూ వస్తోందికాషాయం మరో రకం ఎరుపును సంతరించుకుంటోందిఇంకేవిటి కింకర్తవ్యం???

కామెంట్‌లు లేవు: